ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తున్నారు వీటిలో చాలా వరకు జగన్ ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలే.. ఆయన ఇచ్చిన నవరత్నాలను కూడా ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా ఆయన ప్రవేశపెడుతున్న అన్నీ పథకాలు ప్రజలకు బాగా ఉపయుక్తం అవుతున్నాయి.
అయితే ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగనుంది, జనవరి 9న అమ్మఒడి పథకం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాలకు మోదీని జగన్ ఆహ్వానించబోతున్నారట…దీని కోసం నేరుగా సీఎం జగన్ హస్తిన వెళుతున్నారు.రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకి రావాలి అని ఆయనని కోరనున్నారు.
లేకపోతే దేశంలో ఎక్కడా అమలు చేయని కొత్త పథకం, జనవరి 9న అమ్మఒడి పథకం ప్రారంభంకానుంది దీనికి అయినా ఆయనని రావాలి అని పిలవనున్నారు వైయస్ జగన్ . కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజధాని గురించి కూడా చర్చిస్తారు అని తెలుస్తోంది.