అసలు తెల్లవారు జామున ఏంజరిగింది ఎన్ కౌంటర్ కు కారణాలు ఏమిటి

అసలు తెల్లవారు జామున ఏంజరిగింది ఎన్ కౌంటర్ కు కారణాలు ఏమిటి

0
88

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్,

చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయారు… క్రైమ్ సీన్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో నిందితుల్ని పోలీసులు స్పాట్ దగ్గరకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో నలుగురు నిందితులు పోలీసుల్ని తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను అత్యంత

పాశవికంగా ఎక్కడైతే చంపారో అదే స్పాట్లోనే నలుగురు ఎన్కౌంటర్కు గురయ్యారు. చటాన్పల్లి బ్రిడ్జి కింద.. దిశను పెట్రోల్ పోసి కాల్చి సజీవదహనం

చేసిన ప్రాంతంలోనే నలుగురు, పోలీసులు చేసిన కాల్పుల్లో చనిపోయారు.

అయితే పోలీసులపై రాళ్లు రువ్వి అక్కడ నుంచి పారిపోదాం అని అనుకున్నారు, ఆరీఫ్ అలాగే వీరు ముగ్గురు ఈ సమయంలో అక్కడ అంతా చీకటి ఉండటంతో కచ్చితంగా పారిపోవచ్చు అనుకున్నారు.. కాని పోలీసులు వారిని నిలిపివేశారు ఈ సమయంలో అక్కడ రాళ్లు రువ్వారు వెంటనే పోలీసులు అలర్ట్ అయి వారిపై కాల్పులు జరిపారు. సుమారు తెల్లవారు జామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది అని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.