పద్మావత్ సినిమాలో ప్రభాస్ ఆ పాత్రని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

పద్మావత్ సినిమాలో ప్రభాస్ ఆ పాత్రని ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలుసా ?

0
119

హిందీ లో ఘనవిజయం సాధించిన ” పద్మావత్ ” చిత్రాన్ని రిజెక్ట్ చేసి ప్రభాస్ తప్పు చేసాడని కథనాలు వస్తున్నాయి కానీ ఆ సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేసాడు ప్రభాస్ . బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేయడం మంచి పని ఎలా అవుతుందని అనుకుంటున్నారా ? పద్మావత్ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది , 600 కోట్ల వసూళ్ల ని సాధించింది నిజమే ! కానీ అందులో మెయిన్ రోల్ దీపికా పదుకోన్ కాగా రణ్ వీర్ సింగ్ పాత్రకు అత్యధికంగా ప్రాధాన్యత ఉంది , ఇక ప్రభాస్ కు ఆఫర్ చేసిన పాత్ర ఏంటో తెలుసా.మహారాణా రావల్ రతన్ సింగ్ పాత్ర .

ఈ పాత్ర చేయమని కోరగానే కథ విన్న ప్రభాస్ నిర్మొహమాటంగా చేయనని చెప్పాడట ! ఎందుకంటే ఆ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు . సినిమా చూసిన వాళ్లకు అర్ధం అయ్యే ఉంటుంది ప్రభాస్ ఆ పాత్రని ఎందుకు రిజెక్ట్ చేసాడో ! షాహిద్ కపూర్ పాత్ర సెటిల్డ్ గా ఉంటుంది తప్ప రాజసం , వీరత్వం ప్రదర్శించే ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదు దాంతో ఆ సినిమాని వదులుకున్నాడు . ఒకవేళ ప్రభాస్ ఆ పాత్ర పోషించి ఉంటే నిజంగా అభిమానులు చాలా బాధపడేవాళ్లు . ఎందుకంటే బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది అలాంటి సమయంలో డమ్మీ క్యారెక్టర్ లాంటి పాత్ర పోషిస్తే తప్పకుండా నొచ్చుకునేవాళ్ళు అందుకే కాబోలు అలోచించి నో చెప్పాడు .