ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి… వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగింది… ఈ చర్చలో చంద్రబాబు నాయుడు జగన్ కు జై కొట్టారు… తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని అన్నారు…
ఏపీలో ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చింది తామేనని అన్నారు… 2017లో తాము బ్రిటీష్ కౌన్సిల్ తో అవగాహన ఒప్పంద చేసుకుని సుమారు లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించామని అన్నారు…. ఇంగ్లీష్ మీడియం క్రెడిట్ తమకే దక్కుతుందని అన్నారు…
ఇంగ్లీష్ మీడియం చేసేటప్పుడు ముందస్తు పని చాలా చేయాల్సి ఉందని అన్నారు… బుక్స్ ప్రింటింగ్ పై ఇంగ్లీష్ అక్షరాలతో చేయాలని అందులో కంటెంట్ చాలా అవసరమని అన్నారు… ఇక ఇదే క్రమంలో స్పందించిన విద్యాశాఖ మంత్రి సురేష్ టీడీపీ హాయంలో లక్ష మంది శిక్షణ పేరుతో ముందుగానే డబ్బు చెల్లించి 30 వేల మందికి శిక్షణ ఇవ్వలేదని ఇది పెద్ద బోగస్ అని అన్నారు…