ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది… గ్రామ సచివలాయాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు తమ అభ్యంతరం తెలిపింది… ఇటీవలే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయితీ ఆపీసుకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో పిటీషన్ ధాఖలు అయింది…
ఈ పిటీషన్ పై నేడు విచారించిన న్యాయస్థానం పార్టీ కలర్ రంగులు వేయడంపై తమ అభ్యంతరం తెలిపింది… ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి చర్యలకుపాల్పడటం సమంజసంకాదని తెలిపింది… దీనిపై జిల్లా కలెక్టర్ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది….
కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక గ్రామ సచివలాయాలకు పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా విమర్శలు చేశారు… ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని వారు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…