ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని అసెంబ్లీలో ప్రకటన చేశారు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ , కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండొచ్చన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన.. అలాగే దీనికి కేంద్రం కూడా ఒప్పుకోవాలి ఒప్పుకునే అవకాశం లేదు అమరావతిలో పెట్టుబడి పెట్టిన వారు ఏమి అవుతారు అంటూ జగన్ ని విమర్శించారు చంద్రబాబు.
అయితే జగన్ కేంద్రంతో సయోధ్యగానే ఉన్నారు పూర్తిగా అమరావతి విషయం గురించి అలాగే మూడు రాజధానుల గురించి జగన్ ప్రధాని నరేంద్రమోదీకి అమిత్ షాకి వివరణ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.. త్వరలో ఆయన కేంద్రంతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
జగన్ మంచి నిర్ణయం తీసుకుంటే కావాలనే ఇక్కడ తెలుగుదేశం జనసేన విమర్శలు చేస్తున్నాయి అంటున్నారు వైసీపీ నేతలు..అందుకే కేంద్రం దగ్గర ఈ ప్రపోజల్ చెప్పనున్నారట.. రాజధానిపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత జగన్ దిల్లీ వెళ్లి ఈ వివరాలు ప్రధానికి చెబుతారు అంటున్నారు.. సో మూడు ప్రాంతాలు డవలప్ అవుతాయి కాబట్టి దీనికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు మేధావులు.