ప్రపంచంలో ఏడో స్థానంలో పీవీ సింధు

ప్రపంచంలో ఏడో స్థానంలో పీవీ సింధు

0
129

రియో ఒలంపిక్స్ వేదికపై మన తెలుగుతేజం పివి సింధు మెరుపులు మెరిపించింది. సిల్వర్ మెడల్ ను సాధించి భారత క్రీడాలోకానికి మరో కీర్తిని సాధించింది. అయితే తాజాగా ఫోర్బ్స్‌ ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన క్రీడాకారిణుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు చోటు దక్కించుకుంది. ఇందులో పివి సింధు ఏడో స్థానంలో నిలిచింది.అయితే అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్‌ నుంచి టాప్‌ 10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం.