26న సూర్యగ్రహణం మరి ఏ రాశి వారికి ఎలా ఉందో చూడండి తప్పక ఇవి

26న సూర్యగ్రహణం మరి ఏ రాశి వారికి ఎలా ఉందో చూడండి తప్పక ఇవి

0
107

గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. అయితే ఈనెల 26, గురువారం నాడు సూర్యగ్రహణం ఉంది, దీంతో దేశ వ్యాప్తంగా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అందరూ చూస్తున్నారు. ఇక శ్రీకాళహస్తి దేవాలయం మినహా మిగిలిన దేవాలయాలు అన్నీ కూడా మూత పడనున్నాయి.మరి ఇది ఏ రాశి వారికి మేలు చేస్తుంది అనేది చెబుతున్నారు పండితులు. ఎవరికి చేటు అనేది చెబుతున్నారు చూద్దాం.

శ్రీ వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య నాడు, మూలా నక్షత్రంలో ధనస్సు రాశియందు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా ఇది వస్తోంది గ్రహణ సమయం విషయానికి వస్తే, ఉదయం 8.07కు ప్రారంభమవుతుందట, 9.31 గంటలకు మధకాలమని, 11.20కి ముగుస్తుందని, మొత్తం 3.09 గంటల పాటు గ్రహణం ఉంటుందని చెబుతున్నారు పండితులు.

వృషభం, కన్య, తుల, కుంభ రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే మేషరాశిలో ఉన్నవారికి ఇబ్బందుల వస్తాయట.
మిధున రాశి వారికి స్త్రీ కష్టం వస్తుందట, కర్కాటక రాశి వారికి అతి కష్టాలు వస్తాయట, సింహ రాశి వారికి అశాంతి నెలకొంటుందట, వృశ్చిక రాశి వారికి ధన వ్యయం అవుతుందట, ధనస్సు రాశి వారికి ప్రాణహాని ఉంటుందట, మకర రాశి వారికి ఆరోగ్య హాని ఉంటుందట, మీన రాశి వారికి మనోవేధన ఉంటుందట
ఇక దేవుణ్ని తలచుకుని గ్రహణ సమయంలో ఉండాలి అని చెబుతున్నారు. గ్రహణ విడుపు పట్టు సమయంలో స్నానం ఆచరించాలి అని చెబుతున్నారు పండితులు.