మూడు రాజధానులపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిచారు… గతంలో అమరావతి నిర్మాణానికి అంగీకారం తెలిపిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ఆయన ప్రశ్నించారు….
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు ఇష్టం లేకపోతే వైఎస్సార్ నగరం అని పేరు మార్చుకోవాలని అన్నారు వైఎస్ పేరు పెట్టుకుని రాజధానిని అభివృద్ది చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జ్యోతుల అన్నారు…
ప్రజల సౌకర్యం కోసం పరిపాలన సౌలభ్యం కల్పించాలి కానీ ప్రజలను పరుగులు పెట్టించే పరిపాలన కోరుకోలేదని ఆయన తెలిపారు… కాగ 2014 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు…