మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి…
అంతేకాదు ఇటీవలే మంత్రి వెల్లంపల్లితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు… ఒక వైపు రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్న తరుణంలో గిరి జగన్ ను కలవడం అందరిని ఆశ్చర్యానికి గేరి చేస్తోంది…. రెండు రోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు…
ఇక దీనిపై ఆయన స్పందించారు… తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జగన్ తో కలిశానని అన్నారు… గుంటూరు పట్టణంలో వివిధ అభివృద్ది పనులు గురించి అడగ్గా సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు…
అంతేకాదు తన నియోజకవర్గ సమస్యల గురించి వివరించగా వెంటనే 25 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు