జూ లో ఆడపులిని మగపులి దారుణంగా చంపేసింది ఎందుకో తెలుసా

జూ లో ఆడపులిని మగపులి దారుణంగా చంపేసింది ఎందుకో తెలుసా

0
97

మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా గొడవలు వస్తాయి..ఏదైనా చెప్పిన మాట వినకపోతే మనకు ఎంత కోపం వస్తుంది…మన కంటే జంతువులకి ఇంకాస్త కోపం ఎక్కువ ఉంటుందట.. తాజాగా జరిగిన ఘటన అందరికి ఆశ్చర్యం కలిగించింది….ఓ ఆడపులిని మగపులి దారుణంగా చంపేసిన ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ బయోలాజికల్ పార్క్ లో నిన్న జరిగింది.

సజ్జన్ ఘడ్ అనే పార్కులో దామిని అనే ఆడపులి, కుమార్ అనే మగపులి ఉన్నాయి. కుమార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండేది. దామిని చాలా సౌమ్యం. దీంతో కుమార్ ను ఆడపులి పక్కనే ఉన్న స్పెషల్ ఎన్ క్లోజర్ లో అధికారులు ఉంచారు. రెండు బాగానే ఉండేవి మగ ఆడపులులు కదా రెండు చూపరులని ఆకట్టుకునేవి.

కాని ఏమైందో ఏమో రెండు పులుల మధ్య గొడవ వచ్చింది, పక్కన ఎన్ క్లోజర్ లో అడ్డంగా ఉన్న వైర్లను తెంపేసి కుమార్ అనే పులి, ఆడపులి అయిన దామిని పై దాడి చేసింది , ఆడపులి పీకను కొరికేసింది చివరకు అది మరణించింది. ఆడపులి కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు జూ అధికారులు. చూశారుగాఇలా జంతువులు కూడా కోపంలో ఎలాంటి పనులు చేస్తాయో.