ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విజయవాడ టీడీపీఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు… అమరావతి సచివాలయాన్ని విశాఖకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేసినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
రాజధానిని విశాఖకు తరలించడం మీ తాతా ముత్తాతల వల్ల కూడా కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు నాని… రాజధానిని అభివృద్ది చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని అన్నారు… రాజధానిని తరలించే హక్కు ఎవ్వరికి లేదని అన్నారు…
ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు… ప్రజలు నమ్మి ఓట్లు వేశారని తప్పు చేస్తే ఇక్కడి మహిళలు చీపురుకట్టలతో కొడతారని నాని వ్యాఖ్యానించారు..
2019 ఎన్నికల్లో జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా కూడా చేతకాలేదని ఎద్దేవా చేశారు.. 22 ఎంపీలకు తాము ముగ్గురు ఎంపీలు చాలని అన్నారు..