ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే బిగ్ షాక్ ఇచ్చారు… కృష్ణా జిల్లాకు చెందిన వాసిగా తాను అమరావతే రాజధాని ఉండాలని కోరుకుంటానని అన్నారు…
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు… తాను ఈ ప్రాంత వాసిగా రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని కానీ క్రమ శిక్షణ కలిగిన నేతగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు..
జగన్ నిర్ణయాన్ని పాటిస్తామని అన్నారు.. ప్రస్తుతం వసంత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.,.. ఏపీకి అమరావతి రాజధానిగా కొనసాగించాలని తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి యేస్తున్నాయి