ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది… ఆ పార్టీకి చెందిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట…
ఇప్పటికే ఈ జిల్లాలో టీడీపీ తరపున బలమైన నాయకులు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అలాగే సీఎం రమేష్ వంటి వంటి బడా నేతలు బీజేపీలో చేరడంతో జిల్లాలో పార్టీ గట్టుఎక్కలేని పిరిస్థితి… ఈ క్రమంలోనే వీర శివారెడ్డి కూడా వైసీపీ తీర్ధం తీసుకుంటే జిల్లాలో టీడీపీ సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది…
ముఖ్యమంత్రి దగ్గర కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మరో మూడు రోజుల్లో ఆయన వైసీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉందని అందురు అంటున్నారు… గత ఎన్నికల్లో పార్టీ తరపున కమాలాపురం టికెట్ ను ఆశించారు వీర శివారెడ్డి కానీ చంద్రబాబు ఇవ్వలేదు… అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు… ఇక అప్పటినుంచి టీడీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు…