అనిల్ విస్వరూపం…. టీడీపీ సైలెంట్

అనిల్ విస్వరూపం.... టీడీపీ సైలెంట్

0
82

తెలుగుదేశం పార్టీకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు… తాజాగా రెండవరోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ఈ సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు…

పొత్తులేనిదే ముద్దదిగని పార్టీనేతలు కూడా మాట్లాడుతున్నారని అనిల్ ఆరోపించారు… పొద్దున లేస్తే ఏపార్టీతో పొత్తు పెట్టుకుందామా అనే ఆలోచన టీడీపీ నాయకులు చేస్తారని మండిపడ్డారు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హన్ రెడ్డి నేతృత్వంలో సింహంలా సింగిల్ గా పోటీ చేస్తాము తప్పా పొత్తుపెట్టుకోమని స్పష్టం చేశారు… టీడీపీ నాయకులు 2024లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పే దైర్యం ఉందా అని ప్రశ్నించారు…