టీడీపీ ఎమ్మెల్యేలకు గేట్లు ఓపెన్… జగన్

టీడీపీ ఎమ్మెల్యేలకు గేట్లు ఓపెన్... జగన్

0
87

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు… ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగారని ఆరోపించారు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్ ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నారని మండిపడ్డారు. చిట్టి నాయడు అలాగే వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని భయం పట్టుకుందని ఆరోపించారు విజయసాయిరెడ్డి…

ప్రస్తుతం చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలై పోయాయని అన్నారు. కౌన్సిల్ రద్దుపై సిఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని ఆరోపించారు. ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని ఆరోపించారు..

సిఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని అన్నారు. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారని అన్నారు విజయసాయిరెడ్డి మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవారని విజయసాయిరెడ్డి ఆరోపించారు…