ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుకున్నదే చేశారు. శాసనమండలిని రద్దు చేయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. శాసనసభలో జరిగిన ఓటింగ్‌లో 133 మంది వైసీపీ సభ్యులు మండలి రద్దుకు ఓటేశారు. మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. టీడీపీ శాసనసభ్యులు అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. చంద్రబాబు తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. గతంలో మండలిపై ఆయన మాట్లాడిన క్లిప్పింగ్‌లను సైతం వేసి మరీ పరువు తీశారు. ఒకే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా మరీ పార్లమెంట్‌లో బిల్లు పాస్ అవుతుందా అనేదే ఇక్కడి అందరీ ప్రశ్న..!
ప్రస్తుతం బంతి మోదీ కోర్టులో ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా మండళ్ల నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ ధీమాతోనే వైసీపీ 15 రోజుల్లో బిల్ పాస్ చేయిస్తామని గట్టిగా చెబుతోంది. ఈ నెలఖరున ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు బిల్ పాస్ చేయించి తీరుతామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.