ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన చట్టం దిశ చట్టం.. ఇది కచ్చితంగా అమలు చేస్తామని అనేక మార్పులతో ఈ బిల్లుని రూపొందించారు.. అంతేకాదు ఇతర రాష్ట్రాలు కూడా ఈ బిల్లు ప్రతిని కోరాయి అలా రూపొందించారు ఈ బిల్లు.
కొద్ది రోజుల క్రితం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే, బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచిస్తూ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులోని 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా లేవని, వాటిని సరిచేసి మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది. దీంతో ఏపీ సర్కార్ షాక్ అయింది.
అన్నీ సరైన అంశాలే పొందుపరిచాము అని భావిస్తున్నారు అధికారులు.. మళ్లీ ఈ బిల్లు సరిచేసే పనిలో అధికారులు బిజీ అయ్యారు….ఈ నెల 7న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు. దిశ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్ ను కూడా ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేయనుంది.