భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆయన అంటే ఆరాధ్యం అందరికి ఉంది, ఆయనని చూసే చాలా మంది క్రికెట్ లోకి ఎంటర్ అవుతున్నారు …ఇప్పటికీ సచిన్ అంటే ఆ క్రేజ్ ఉంది, అయితే ఆయన తనయుడి గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. సీకే నాయుడు ట్రోఫీలో పాల్గొనే ముంబయి జట్టులో అర్జున్ ఆల్ రౌండర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు.. ఇది సచిన్ అభిమానులని ఆనందం కలిగించింది.
రెండేళ్ల క్రితం ముంబయి అండర్-19 జట్టులో ఎంట్రీ ఇచ్చిన అర్జున్, ముందు పెద్దగా తన ప్రతిభ చూపించలేదు, తాజాగా
ఇంగ్లాండ్ లో కూడా శిక్షణ పొందాడు అర్జున్ , ఫాస్ట్ బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు..టీమిండియా జూనియర్ టీమ్ ల తరఫున విదేశాల్లో ఆడాడు. అయితే ఈ ట్రోపీలో అతని ఆటతీరు ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.