ఇది వరకు నాకు షార్ట్ టెంపర్ ఉండేది కానీ ఇప్పుడు….

ఇది వరకు నాకు షార్ట్ టెంపర్ ఉండేది కానీ ఇప్పుడు....

0
126

హీరోయిన్ సమంత యు టర్న్ మూవీ ప్రమోషన్ లో బాగంగా ఓ ఛానల్ ల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తమ ఇంట్లో జరిగే సంగతులు బయటపెట్టారు. “నిజం చెబుతున్నాను … ఇంట్లో అప్పర్ హ్యాండ్ ఆయనదే. బయట జనాలకి కనిపించేలా చైతూ ఇంట్లో ఉండడు. ఇంట్లో పరిస్థితి రివర్స్ ఉంటుంది.

బయట నేను ఎక్కువగా మాట్లాడేస్తూ .. అల్లరి చేస్తూ కనిపిస్తాను గానీ, ఇంట్లో మాత్రం సైలెంటే. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడు కనుక, ఇంట్లో ఆయనను నేను ‘బేబీ’ అని పిలుస్తూ ఉంటాను” అంటూ సమంత చెప్పారు. “ఇది వరకు నాకు షార్ట్ టెంపర్ ఉండేది. ఈ మధ్యకాలంలో నేను చాలా మారిపోయాను. నా షార్ట్ టెంపర్ మొత్తాన్ని చైతూ తగ్గించేశాడు.” అని వెల్లడించారు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.