AMB సినిమాస్ పేరుతో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్

AMB సినిమాస్ పేరుతో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్

0
135

మహేష్ హీరో గా , బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. ఇక సినిమాల్లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకునే మహేష్ బ్రాండ్ మీద కూడా బోలెడంత సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు వ్యాపారంలోకి అడుగెట్టబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అందులో భాగంగానే ఇంతకుముందే మహేష్ బాబు అమరావతి, వైజాగ్ లలో కొంత భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం ఉంది.

ఇక తాజాగా మహేష్ కూడా ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నట్టుగా చెబుతున్నారు. ఏషియన్ ఫిలింస్ వారితో కలిసి మహేష్ బాబు ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నాడట.ఏఏంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ లను హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్నారు. అయితే ఒకచోట సక్సెస్ అయితే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహేష్ అండ్ ఏషియన్ ఫిలింస్ వారు ముఖ్యపట్టణాల్లో ఈ మల్టిప్లెక్స్ లు నిర్మిస్తారని తెలుస్తుంది. మరి సినిమాలు, బ్రాండ్స్ తో బాగా సంపాదిస్తున్న మహేష్ ఇప్పుడు వ్యాపారంలోను దూసుకుపోతున్నాడు.