మార్కెట్లోకి కొత్త వెయ్యి నోట్లు డేంజర్ న్యూస్ తప్పక తెలుసుకోండి

మార్కెట్లోకి కొత్త వెయ్యి నోట్లు డేంజర్ న్యూస్ తప్పక తెలుసుకోండి

0
128

ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు జరిగిపోయింది, అయితే దానిని మించిన పెద్ద నోట్లు వచ్చాయి.. అవే 2000 నోట్లు.. తర్వాత కొత్తగా 500 -200-100-50-10 కొత్త నోట్లు వచ్చాయి, అయితే ఇటీవల రెండు వేల నోటు కూడా రద్దు అవుతుంది అని అనేక వార్తలు వినిపించాయి, పలు బ్యాంకుల్లో పెద్ద నోట్లు రాకపోవడంతో ఇక రెండు వేల నోటుకి సర్కారు గుడ్ బై చెప్పిందా అనే అనుమానం అందరికి వచ్చింది.

అయితే తాజాగా కొత్తగా వెయ్యి నోట్లు వచ్చేశాయి,ఇదిగో ఇవే ఆ కొత్త నోట్లు అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పచ్చరంగులో ఉన్న ఈ నోట్లు చూసి తమకూ రూ.వెయ్యి నోట్లు కావాలని బ్యాంకులకు వెళ్తేగానీ అసలు విషయం తెలియడంలేదు.

ఇప్పటి వరకూ ఆర్బీఐ వెయ్యరూపాయల నోట్లని ముద్రించలేదు, కాని కొందరు కవాలనే ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారు.. ఇతర దేశాల నుంచి కొందరు మోసం చేసేందుకు కూడా ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు, అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారుబ్యాంకు అధికారులు, అసలు వెయ్యి ఐదు వేల నోట్లు కొత్తవి ఆర్బీఐ విడుదల చేయలేదట, ఇది పక్కా ఫేక్ న్యూస్ అంటున్నారు.