డ్రైవింగ్ ఫర్ ఫెక్ట్ గా వస్తేనే లైసెన్స్ ఇవ్వాలి… లేకపోతే వారు చేసే ప్రమాదాలకు ప్రజలు గురి కావాల్సి ఉంటుంది… అందుకే మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ కచ్చితంగా ఇలాంటి విషయాలలో సరైన నిబంధనలు అనుసరించాల్సిందే, అందుకే వారికి డ్రైవింగ్ ట్రాక్ పై టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
తాజాగా ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్నాడు.. పరీక్షకు వెళ్లాడు.. పాస్ అయ్యాడు లైసెన్స్ తీసుకున్న విషయం తన స్నేహితులకి ఫోన్ చేసి చెప్పాడు.. ఇక సంతోషంలో ఉన్నాడు, అతనికి మెసేజ్ లు సందేశాలు పింపిచారు ఫ్రెండ్స్.
ఈ సమయంలో వాటిని చూసుకుంటూ కారు నడిపాడు.. ఆ కారు అదుపుతప్పి నదిలో పడింది,
దాంతో లైసెన్స్ పొందిన ఆనందం పది నిమిషాల్లోనే ఆవిరైంది. ఈ ఘటన చైనాలో జరిగింది, అదృష్టం ఏమిటి అంటే చిన్న గాయాలతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.. అతను వంతెనపై నుంచి వెళుతూ ఉంటే పక్కన నదిలో అతని కారు పడిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, దీంతో అతనిపై కేసు నమోదు చేశారు అక్కడ పోలీసులు.