ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… పోటీ చేసి గెలిచే దమ్ము లేక జగన్ మోహన్ రెడ్డి దద్దమ్మలా అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు…
రాక్షస రాజ్యంలో నామినేషన్ వేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పక్క పోలీసులను మరో పక్క అధికారులను వైసీపీ నాయకుల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు
టీడీపీ అభ్యర్థుల పై అక్రమ కేసులు పెడుతున్నారు, నామినేషన్ పత్రాలు చించేస్తున్నారు. ఏకపక్షం చేసుకోవడానికి దాడులకు దిగుతున్నారు. అధికారులే నామినేషన్ వేసే హక్కుని హరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు ప్రశ్నించారు…