రోడ్డుపైన అమ్మాయి ని చూడగానే కచ్చితంగా అబ్బాయిలు అనుకునే మాట ఈ అమ్మాయి బాగుంది అంటారు..
అంతేకాదు ఆమెతో మాట కలపడానికి ప్రయత్నిస్తారు ముందు స్నేహం, ఆ తర్వాత ప్రేమ, తర్వాత పెళ్లి అంటారు, ఎక్కడ చూసినా ఇదే, అయితే ఇలాంటి విషయాలలో అమ్మాయిలు తొందర పడరు, అబ్బాయిలు గ్రీకువీరుడిగా అందంగా కనిపిస్తే వారి చూపు తిప్పుకోలేరట.
అందంగా ఉన్న అబ్బాయి కనిపిస్తే మాట్లాడాలి అని ఉంటుంది అయినా వారు మాట్లాడలేరు, వారితో చనువుగా ఉండాలి అని ఉంటుంది ఉండలేరు, సోడా బుడ్డి కళ్లద్దాల వ్యక్తులని ఇష్టపడరట, ఇలా వారు తమకు దక్కాలి అని కోరుకుంటారు. ఇక ముందు అమ్మాయి వెళ్లి మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయి చాలా స్పీడు అని అనుకుంటారు.. నేను వెళ్లి మాట్లాడితే దక్కే అందగాడు రాడు అని ఫీల్ అవుతారట.
అంతేకాదు అబ్బాయి నచ్చితే వెంటనే అతని వైపు ఓ నవ్వు వదులుతారు.. ఆ నవ్వు కచ్చితంగా అబ్బాయి తెలుసుకోవాలి, అది ఇష్టంతో నవ్విన నవ్వు అని, అంతేకాదు ఆమె చూపులు అతిని వైపే ఉంటాయి.. ఇలా ఉన్నాయి అంటే కచ్చితంగా అతనిని ఆమె కావాలి అని కోరుకున్నట్లే మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడినట్టే.