ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు…. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…
రూ.12,500ల రైతుభరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ది వైసీపీ అధిష్టానం చెప్పిందని గుర్తు చేశారు…
అయితే ఆ లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం 10 నెలల్లో 400మంది రైతుల్ని బలితీసుకుందని లోకేశ్ ఆరోపించారు…