సీఎం జగన్ సిగ్గుగాలేదా…. లోకేశ్

సీఎం జగన్ సిగ్గుగాలేదా.... లోకేశ్

0
89

తెలుగుదేశం నాయకులపై హత్యాయత్నం చేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారని లోకేశ్ ఆరోపించారు.. టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెడితే చర్యలు ఉండవని ఎద్దేవా చేశారు…

తుగ్లక్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోస్టులు పెడితే మాత్రం అర్ధరాత్రి అరెస్టులా అని ప్రశ్నిచారు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు లోకేశ్

పోలీసు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కోర్టు ముందు నిలబెడుతున్నారు. చివాట్లు పెట్టిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు వేసి కోర్టు మెట్లు ఎక్కిస్తామని లోకేశ్ హెచ్చరించారు…