శివుడ్ని పూజించే స‌మ‌యంలో ఈ పొర‌పాట్లు చేయ‌కండి

శివుడ్ని పూజించే స‌మ‌యంలో ఈ పొర‌పాట్లు చేయ‌కండి

0
101

శివుడ్ని మ‌నం ఎంత‌గానో ఆరాధిస్తాం… మ‌న దేశంలో ఉన్న శివాల‌యాల్లో నిత్యం ఆయ‌న‌కు పూజ‌లు చేస్తూనే ఉంటాం, శివయ్య కు నిత్య అభిషేకాలు జ‌రుగుతూనే ఉంటాయి, ఇక ఆదిదేవుడిగా ఆ ల‌య‌కారుడ్ని మ‌నం పూజిస్తాం, అయితే సోమ‌వారం వ‌చ్చింది అంటే క‌చ్చితంగా శివాల‌యానికి వెళ్లి స్వామిని కొలుస్తారు, అంతేకాదు స్వామికి అభిషేకం చేస్తారు.

సోమ‌వారం నాడు లింగరూపంలోని శివుడిని పూజించిన వారు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వేదాలు చెబుతున్నాయి, ఇక శివుడ్ని పూజించే స‌మ‌యంలో ఈ పొర‌పాట్లు చేయ‌కూడ‌దు అని చెబుతున్నారు మ‌రి అవి చూద్దాం.

శివునికి మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రం సమర్పిస్తే మంచి జరుగుతుంది. అష్ట‌మి న‌వ‌మి, పౌర్ణమి, మకర సంక్రాంతి, సోమవారం రోజులలో బిల్వ పత్రాలను కోయకూడదు. ఇక శివ‌లింగానికి ప‌సుపు కుంకం కాదు విబూది గంధం మాత్ర‌మే పెట్టాలి పూజించాలి.

శివుడికి సంపంగి పూలను సమర్పించకూడదు. శివుని కంటే ముందు వినాయకుడిని పూజించాలి. శివునికి తులసి ఆకులతో కూడా పూజ చేయకూడదు, ఇక శివుడికి వెల‌గ‌పండు స‌మ‌ర్పిస్తే చాలా మంచిది.