కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి పెరుగుతోంది… దీంతో పనులులేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ వారు అక్కడే నిలిచిపోయారు.. రవాణా లేదు సొంత గ్రామాలకు వెళ్లే ఆస్కారం లేదు, దీంతో అందరూ ఎవరి పని వారు చేసుకోలేక ఇంట్లోనే ఉండిపోయారు. కచ్చితంగా ఇది వచ్చే నెల 14 వరకూ పాటించాల్సిందే.
ఇక బ్యాంకులకు మూడు నెలలు ఈఎంఐ వాయిదా పడింది…మూడు నెలల తర్వాత పేమెంట్ చేయవచ్చు ఈ సమయంలో విద్యుత్ బిల్లులు కూడా మూడు నెలలు ఆపేశారు.. తర్వాత పేమెంట్ చేయవచ్చు, తాజాగా . ఈ పరిస్థితుల్లో ముంబైలోని భవన యజమానులు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తమ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి నుంచి రెంట్ వసూలు చేయకూడదని నిర్ణయించారు. చాలా మంది ఇప్పటికే ఈ విషయం తెలిపారు, 1 వ తారీఖు వస్తుంది కాబట్ఇ యజమానులు అద్దె ఇంటి వారికి చెబుతున్నారు, క్షేమంగా ఉండాలి తర్వాత నగదు ఇవ్వండి అని చెబుతున్నారు..సామాన్యుల సంపాదనలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే సరిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు, మరి ఇందులో ముఖ్యంగా కొందరు పూర్తిగా రద్దు చేస్తుంటే మరికొందరు మూడు నెలల తర్వాత రెంట్ ఇవ్వండి అని చెబుతున్నారు, ఇది మంచి నిర్ణయమే అని చెప్పాలి.