ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు… మొదట్లో ఏపీపై కరోనా మహమ్మారి అంత ప్రభావం చూపలేదు అయితే తాజాగా కరోనా వైరస్ తన కొరలను చాచుతోంది… ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాలేదు…
తాజాగా ఒకే సారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో సీఎం జగన్ కఠిన మైన నిర్ణయాలు తీసుకున్నారు… తనతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ప్రజా ప్రతినిధులు జీతాలు 100 శాతం కోత పెట్టేశారు… ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది…
అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ తదితర భారత సర్వీసుల్లో పని చేసే ఉద్యోగులు నుంచి 60 శాతం ఇతర క్యాడర్లో పని చేసే ఉద్యోగులు 50 శాతం నాలుగో తరగతి ఉద్యోగులు 10 శాతం వాయిదా వేయనున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది…