సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు లేఖ..

సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు లేఖ..

0
91

కరోనా బాధితుల లెక్కలపై ఏపీ సర్కార్ నిజాలను దాస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు… కరోనా బాధితులు విషయంలో ఎప్పటికప్పుడు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు…

రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, విజయవాడ వంటి ప్రాంతాల్లో వైరస్ కారణంగా చనిపోయినా ప్రభుత్వం చెప్పలేదనే వార్తలు వస్తున్నాయని తెలిపారు… లెక్కలు తక్కువగా చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు…

నిజాలను దాచిపెడితే పెను ప్రమాదం ఉందని అన్నారు…. కేంద్రం ప్రకటించిన లక్షా 75 వేల కోట్ల ప్యాకేజీని వినియోగించుకుని మూడు నెలలకు సరిపడా రేషన్, పింఛన్ ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు..