ఈ కరోనా మహమ్మారి కచ్చితంగా కొన్ని జీవితాలకి కొన్ని గుణాపాఠాలు నేర్పింది, సంపాదించిన సంపాదన అంతా ఒకేసారి ఖర్చు చేస్తే. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియచేసింది, అలాగే లేనివాడు ఉన్నవాడు ఎవరైనా ఆ పూట తిండి కోసం ఎంత కష్టాలు పడాలో తెలిపింది, ఒక ప్రాంతాంలో చిక్కుకుంటే పరిస్దితి ఎలా ఉంటుందో తెలిపింది
అయితే ఉపాధి లేని వారు నెల రోజులు ఇంటి పట్టున ఉంటే ఆ బాధలు ఎలా ఉంటాయి అనేది తెలిపింది, ఓ చిన్నారి తన తండ్రి రోజుకి 600 సంపాదిస్తాడు, అందులో తల్లికి కేవలం 400 ఇస్తాడు, అందులోనే ఆ తల్లి ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా పిల్లల స్కూల్ ఫీజు, బట్టలు, పై ఖర్చు, ఇలా అన్నీ చేస్తోంది.
మిగిలిన రెండు వందలతో ఆ తండ్రి నిత్యం తాగి వస్తాడు, అయితే ఈ కరోనాతో మందు లేక ఆ తండ్రి ఇంటి పట్టున ఉంటున్నాడు, నాన్న నువ్వు మందు తాగకపోతే నెలకి 6000 సేవ్ అవుతాయి నాన్న నాకు సైకిల్ కొనచ్చు డాక్టర్ ని చదివించవచ్చు, అందరిలా బైక్ పై నన్ను తిప్పవచ్చు నాన్న అని తండ్రికి తెలిసేలా రాసింది, ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది, ప్లీజ్ దయచేసి మద్యానికి దూరంగా ఉండండి కుటుంబాల్లో వెలుగు నింపండి.