ఈ లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఉద్యోగ ఉపాధి ఏమీ లేకపోవడంతో ఇంటికి పరిమితం అయ్యారు అందరూ, అయితే చాలా మంది ఇంటిలో ఉండటంతో అష్మాచెమ్మ, హౌసీ, కేరమ్స్, బ్యాంకింగ్, వైకుంఠపాలి ఇలా ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు, కొందరు పబ్ జీ లాంటి మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు.
ఈ సమయంలో గేమ్ తో వివాదం వచ్చింది ఓ కుటుంబానికి, గుజరాత్ లోని వడోదరలో ఒక వ్యక్తి తన భార్య పై దాడికి దిగి విచక్షణారహితంగా దాడి చేసి వెన్ను విరగ్గొట్టాడు. వీరిద్దరు ఇంతలా గొడవ పడటానికి కారణం వీరిద్దరూ లూడో గేమ్ ఆడటం. అందులో ఆన్ లైన్ గేమ్ ఆడిన సమయంలో ఆమె గెలిచింది. ఇలా నాలుగు రోజులుగా అతను ఓడిపోతూనే ఉన్నాడు, దీంతో అతను కోపంతో రగిలిపోయాడు.
వారం క్రితం ఆమె గెలవడంతో ఆమెపై కోపంతో కొట్టాడు, ఆమె వెన్నపూస విరిగిపోయేలా కొట్టాడు, దీంతో ఆమెని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు స్ధానికులు.. చివరకు ఆమె కోలుకుంది… కాని ఆమె మాత్రం భర్తకి విడాకులు ఇస్తాను అని అమ్మానాన్న దగ్గరకు వెళతాను అని చెప్పింది.. కాని చివరకు పెద్దలు వారి మధ్య వివాదం సర్దుమణిగేలా చేశారు.. దీంతో ఆమె భర్త దగ్గరకు వెళతాను అని చెప్పింది.