పొలంలో గొయ్యి తవ్విన పిల్లలు… లోపల చూసేసరికి ప‌రుగో ప‌రుగు

పొలంలో గొయ్యి తవ్విన పిల్లలు... లోపల చూసేసరికి ప‌రుగో ప‌రుగు

0
107
Uttar Pradesh

ఒక్కోసారి నిధులు నిక్షేపాలు బంగారం వెండికి సంబంధించినవి అక‌స్మాత్తుగా క‌నిపిస్తూ ఉంటాయి, అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి, అయితే నిధులు ఈ రోజుల్లో ఇంకా బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. చ‌రిత్ర‌కు సంబంధించిన అవ‌శేషాలు అక్క‌డ ఉంటే త‌వ్వకాలు జ‌రిపేవారు ఉంటున్నారు.. కాని అనూహ్యంగా ఏ చ‌రిత్ర లేని ప్రాంతం అది, కాని అక్క‌డ దొరికంది చూసి ఆశ్చ్య‌పోయారు అంద‌రూ.

ఆరియా గ్రామంలోని పిల్లలు బంజరు భూమిలో ఆడుకుంటూ ఒక గొయ్యి తవ్వారు. లోపలికి చూసి ఆశ్చర్యపోయారు. అందులో 30 వెండి నాణాలు కనిపించాయి. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఆ నాణాలను స్వాధీనం చేసుకున్నారు. వెంట‌నే వాటిని పురావస్తు శాఖ అధికారుల‌కి అప్ప‌గించారు

వారు వాటిని ప‌రిశీలించారు, అయితే ఇవి ఇప్ప‌టివి కాదు అని తెలిపారు, ఇవి పూర్తి వెండినాణాలే అయితే
దొరికిన 27 నాణాలు, 1840 విక్టోరియా కి చెందిన 3 నాణాలు, 1835 కింగ్ విలియమ్స్ కాలానికి చెందినవిగా
వెల్ల‌డించారు, ఇక ఇక్క‌డ ఎవ‌రిని త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌వ‌ద్దు అని అధికారులు తెలిపారు. కాని ఇక్క‌డ‌ గ్రామ‌స్తులు మాత్రం భారీగా నిధులు ఉంటాయి అని భావిస్తున్నార‌ట‌.