ముట్టు గుడిసెల ఆచారం ఇంకా ఇలాంటివి పాటిస్తారా

ముట్టు గుడిసెల ఆచారం ఇంకా ఇలాంటివి పాటిస్తారా

0
232

అదొక గ్రామం అక్క‌డ ఇంకా ఓ విచిత్ర సంప్ర‌దాయం ఆచారం పాటిస్తున్నారు, ఇంత సైన్స్ టెక్నాల‌జీ డ‌వ‌ల‌ప్ అయింది, అమ్మాయిలు రాకెట్ ప్ర‌యోగాల్లో కూడా స‌క్సెస్ అవుతున్నారు.. ఈ స‌మ‌యంలో కూడా ప్ర‌తీ స్త్త్రీకి సాధార‌ణంగా భావించే పిరియ‌డ్ ని ఇక్క‌డ వారు ఏదో శాపంగా పాటిస్తున్నారు.

అవును పిరియ‌డ్ మొద‌లు అయ్యే మొద‌టి రోజు నుంచి ఇక్క‌డ ఆ స్త్రీ ముట్టు గుడిసెలో ఉంటుంది.. దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ రూమ్ ఏర్పాటు చేశారు, కేవ‌లం ఓ చాప దిండు మాత్ర‌మే ఉంటుంది, ఎలాంటి సౌక‌ర్యాలు ఉండ‌వు, అక్క‌డ‌కు ఆహ‌రం కుటుంబ స‌భ్యులు అందిస్తారు, బాలింత‌లు కూడా ఇక్క‌డే ఉండాల్సిందే,

ఇలాంటి ఆచారం కొన్ని సంవ‌త్స‌రాల నుంచి వ‌స్తుంద‌ని ఇది పాటిస్తున్నారు అక్క‌డ జ‌నం, చాలా మంది ఇది మార్చాలి అని చెప్పినా మార‌లేదు, మా ఊరికి మంచిది కాదు అని అందుకే ఇలా పాటిస్తున్నాము అంటున్నారు, ఆ మూడు రోజులు ఆ గుడిసెలో ఉంచుతారు ఆమెని, ఇప్పుడు గుడిసె తీసి రేకుల షెడ్డు అలాగే ఓ సిమెంట్ ఇటుక‌ల రూమ్ ఏర్పాటు చేశారు, దీంతో అక్క‌డ‌కు చాలా మంది సంస్క‌ర్త‌లు వెళ్లి ఇది మార్చాలి అని తెలిపినా వారు మాత్రం ఈ ఆచారం మార్చ‌‌ర‌ట‌.