ప్రధాని మోడీ జాతినుద్దేశించి ఏమని మాట్లాడారంటే… సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు.. భారత్ ఔషదాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని మోడీ అన్నారు… ప్రపంచానికి యోగా భారత్ కానుకగా ఇచ్చిందని అన్నారు భారత్ సామర్థ్యాన్నిప్రపంచం నమ్ముతోందని అన్నారు…
2000 సంవత్సరంలో వై2కే సమస్య వచ్చిందని అప్పుడు ప్రపంచాన్ని ఈ గండం నుంచి గట్టెక్కించింది భారత్ అని మోడీ తెలిపారు… భారత్ అభివృద్ది పయణం మళ్లీ మొదలైందని అన్నారు…
నాణ్యమైన వస్తువులను తయారు చేసే సామర్థ్యం భారత్ కు ఉందని అన్నారు… భారత్ స్వయం సమృద్ది సాదిస్తోందని రాబోయే రోజులన్నీ టెక్నాలజీ ఆధారిత సేవలే అని అన్నారు… ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల అర్థిక ప్యాకే జ్ ని ప్రకటించింది…..వ్యవసాయ కార్మికులు కుటీర లఘు పరిశ్రమలపై వెచ్చించనున్న కేంద్రం…