బిగ్ బాస్ 4లో ఆ యాంక‌ర్ కు ప్లేస్ ?

బిగ్ బాస్ 4లో ఆ యాంక‌ర్ కు ప్లేస్ ?

0
99

బిగ్ బాస్ రియాల్టీ షో కు ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలిసిందే, అయితే ఇక తెలుగులో ఈ ఏడాది బిగ్ బాస్ 4 సీజ‌న్ స్టార్ట్ అవుతుంది, ఇక ప్ర‌తీ ఏడాది వ్యూయ‌ర్ షిప్ రేటింగ్ కూడా పెరుగుతోంది, ఇక ఈ ఏడాది స‌రికొత్త‌గా బిగ్ బాస్ షో ఉంటుంది అంటున్నారు, ఏర్పాట్లు అయితే జ‌రిగాయ‌ట‌, లాక్ డౌన్ వ‌ల్ల‌ 40 రోజులుగా ఈ వ‌ర్క్ ఆగింది అని తెలుస్తోంది.

ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.. ఇది ఇంకా ఫైన‌ల్ కాలేదు.గ‌తంలో మాదిరిగా ఈ సారి కూడా ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో సెలబ్రిటీని ఎంపిక చేయనున్నారు, ఇక సామాన్యుల‌కి కూడా ఈసారి మ‌రో ఇద్ద‌రికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే నిర్వాహకులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా ఈ జాబితాలో యాంక‌ర్ వర్షిణి పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై వర్షిణి స్పందించారు, అయితే త‌న‌కు బిగ్ బాస్ 2. అలాగే 3 లో కూడా అవ‌కాశం వ‌చ్చింది కాని, అప్పుడు డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన కుదరలేదు ఇప్పుడు అవ‌కాశం వ‌స్తే తాను వెళ‌తాను అంటోంది, ఆమె అభిమానులు కూడా వెళ్లాలి అని కోరుతున్నారు.