ఈ కరోనా వేళ కొన్ని కుటుంబాలు నిజంగా ఆశ్చరానికి గురి అవుతున్నాయి, లాక్ డౌన్ వేళ ఓ ఇంటిలో ఆనందం కనిపించింది, మధ్యప్రదేశ్‌లోని దిల్వారీ గ్రామంలో ఆ ఇంటి యజమానికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి వచ్చాడు ఇంటికి తీసుకువెళ్లండి అన్నారు, దీంతో మా అబ్బాయి చనిపోయి మూడు ఏళ్లు అయింది కదా అని అనుకున్నారు.
కాని తిరిగి స్టేషన్ కు వెళితే వారి అబ్బాయి కనిపించాడు ..దీంతో షాక్ అయ్యారు, అయితే అసలు మూడేళ్ల క్రితం వారి కొడుకుఉదయ్ పై అన్యాయంగా కొందరు దొంగతనం కేసు పెట్టారు, దీంతో అక్కడ నుంచి కుమారుడు పారిపోయాడు, దీంతో అతని తండ్రి కొడుకు కనిపించడం లేదు అని కేసు పెట్టాడు , కొద్ది రోజులకి ఓ చోట అస్తిపంజరం కనిపించింది .
తన కుమారుడు చొక్కా ఉండటంతో తమ బిడ్డచనిపోయాడు అని అంత్యక్రియలు కూడా చేశారు..
కాని అసలు ఏం జరిగింది అంటే అతను పారిపోయి దిల్లీ వెళ్లి అక్కడ కూలి పని చేసుకున్నాడు.. ఈ లాక్ డౌన్ వేళ సొంత ప్రాంతానికి వచ్చేశాడు, దీంతో వారి కుటుంబం చాలా ఆనందంలో ఉంది, దీంతో ఆ అస్తిపంజరం ఎవరిది అని మళ్లీ కేసులు చూస్తున్నారు.