వేళస్వామి కేరళకు చెందిన వ్యక్తి….ఏకంగా తనకు ఇష్టమైన ఏనుగుకి రోజు వెళ్లి దానికి కావలసిన ఆహరం పెడతారు, స్ధానికంగా ఉండే కోవెల దగ్గర ఆ ఏనుగుకి రోజు బలమైన ఆహరం పెడతాడు. అంతేకాదు అతను రైల్వేలో పనిచేస్తాడు, అతనికి నెలకి వచ్చే 42000 జీతంలో దానికే దాదాపు 20 వేలు ఖర్చు చేస్తారట, ఇక ఎవరైనా దానికి ఆహరం ఇస్తాము అంటే తీసుకువచ్చి కూడా పెడతారట.
తనకు చిన్నతనం నుంచి ఏనుగులు అంటే ఇష్టమని అందుకే ఇలా ఆ ఏనుగుని ఎప్పటి నుంచో ఈ కోవెలలో చూస్తున్నా అని, అది అంటే అభిమానం అని చెబుతాడు,ఆ గజరాజు కూడా అతనిపై అంతే ప్రేమ చూపిస్తుంది.
రోజు అతనిని తొండంతో ముద్దాడుతుంది, ఆయన తెచ్చిన ఆహరం పుష్టిగా తింటుంది, ఈ లాక్ డౌన్ లో కూడా దానికి ఆయన ఫుల్ గా భోజనం పెడుతున్నారు, ఈ విషయం గురించి ఓ రైటర్ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది, నిజంగా ఆయన జంతుప్రేమికుడు అని అందరూ కితాబిస్తున్నారు.