భార్యకు కరోనా పాజిటివ్.. చివ‌ర‌కు దారుణ‌మైన ప‌ని చేశాడు భ‌ర్త‌

భార్యకు కరోనా పాజిటివ్.. చివ‌ర‌కు దారుణ‌మైన ప‌ని చేశాడు భ‌ర్త‌

0
91

ఈ వైర‌స్ సోకిన వారిని, చికిత్స తీసుకుని ఇంటికి వ‌చ్చిన వారిపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ద్ద‌ని, వారిపై ఎలాంటి వివ‌క్ష చూప‌ద్దు అని ప్ర‌భుత్వం కూడా చెబుతోంది.. అయితే ఈ వైర‌స్ సోకిన త‌ర్వాత కొంద‌రు ఆ కుటుంబాల‌ని అతి దారుణంగా చూస్తున్నారు, ఏదో ఆ జ‌బ్బు మ‌న‌కు వ‌స్తుందేమో అనే భ‌యం వారిలో ఉంది, ఇక ఆ కుటుంబం తో మాట‌లు కాని ఆ ఇంటివైపు చూడ‌టం కాని చేయ‌డం లేదు.

తాజాగా ఓ మ‌హిళ‌కు వైర‌స్ సోకింది, దీంతో ఆమెని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.. భ‌ర్త‌కు కుటుంబం స‌భ్యుల‌కి రాక‌పోవ‌డంతో వారిని సేఫ్ గా ఇంటిలో ఉండ‌మని చెప్పారు, కాని ఆమె భ‌ర్త భార్య‌కు వైర‌స్ సోకింది అని తెలిసి మాన‌సికంగా ఇబ్బంది ప‌డ్డాడు..

త‌న‌లో త‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఆవేశంతో పిచ్చిగా ప్రవర్తించాడు. తరువాత మద్యం సేవించి వచ్చి, అదే మత్తులో ఇంటి సమీపంలోని రెండు బైకులు, ఒక ఆటోకు నిప్పుపెట్టాడు. స్థానికుల ఫోన్ కాల్ తో స‌మాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదేం ప‌నిరా బాబు అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.