గిరి పూర్ జిల్లాలోని ఓ అటవీ గ్రామం.. అక్కడ నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో మహిళకు తొమ్మిది నెలలు నిండాయి, అయితే అర్దరాత్రి సమయంలో ఆమెకి నొప్పులు మొదలయ్యాయి, దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ కి కబురు పంపారు, అంబులెన్స్ 18 నిమిషాల్లో వచ్చేసింది.
అయితే అది చీకటి ప్రాంతం, అడవి ప్రాంతం, ఇలా ఆస్పత్రికి వెళుతున్న సమయంలో ఓ నాలుగు సింహాలు అక్కడ రోడ్డుకి అడ్డంగా పడుకుని ఉన్నాయి, అవి పక్కకు వెళ్లడం లేదు, అంబులెన్స్ కి దారి ఇవ్వడం లేదు, దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకి అక్కడే ప్రసవం చేశారు.
చివరకు పుట్టిన పసిపాపని ఆమెని క్షేమంగా ఆస్పత్రికి తీసుకువెళదాం అని అంబులెన్స్ తీశారు, అయినా అరగంట వరకూ అక్కడే ఉన్నాయి సింహాలు, తర్వాత అవి వెళ్లడంతో వారిని క్షేమంగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు, దీంతో చివరకు డాక్టర్లు వారిని చూసి క్షేమంగా ఉన్నారు అని చెప్పారు.