రాజధాని విభజన బిల్లు ఇంకా పెండింగ్ లో ఉంది… శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది… అయితే ఇంతవరకూ దీనిపై సెలక్ట్ కమిటీయే ఏర్పాటు కాలేదు… సెలెక్ట్ కమిటీకి పేర్లు సూచించాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్ని పార్టీల నేతలను కోరారు.. కానీ అధికార వైసీపీ మాత్రం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యంగ నిబంధనలకు విరుద్దమంటూ సభ్యుల పేర్లు ఇవ్వడానికి తిరస్కరించింది…
ఈ లోపు అసెంబ్లీ సమావేశమై శాసనమండలిని రద్దు చేసింది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానారికి పంపింది…అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దుకు ఆమోదం తెలపకపోవడంతో మండలి లైవ్ లోనే అన్నట్లే… దీంతో మరోసారి శాసనసభను ఏర్పాటు చేసి మూడు రాజధానుల బిల్లును అమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది… ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును శాసనమండలికి పంపి నాలుగు నెలలు గడుస్తుండటంతో అసెంబ్లీలో బిల్లును మరోసారి పెట్టి అమోదించుకోవచ్చని రాజ్యంగ నిపుణులు చెబుతున్నారు..
మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు… దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్య కూడా ధాఖలు అయింది… అయితే బిల్లులు చట్ట సభల్లో అమోదం పొందిన తర్వాతనే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొనడంతో అందుక అనుగుణంగా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది… కరోనా వైరస్ కొంత శాంతించిన వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారట… అంతేకాదు జూన్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు…