ఆ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు వింత సంప్రదాయం

ఆ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు వింత సంప్రదాయం

0
89

కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వింత సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు, మన దేశంలో కూడా కొన్ని వింత పద్దతులు ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి, ఈ సంప్రదాయం చాటున మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంకా పల్లెల్లో మూడ నమ్మకాలు పాతుకుపోయి ఉన్నాయి, వాటిని ప్రశ్నించే వారు ఉండటం లేదు.

భారతదేశంలోని గ్రామాల్లో భార్యలను అద్దెకిచ్చేవారు ఉన్నారు తెలుసా, ఇది కొన్ని ప్రాంతాల్లో జరుగుతోంది. నేరుగా భర్తలు తమ భార్యలను వేరే వారికి అగ్రిమెంట్ చేసుకుని అద్దెకి ఇస్తారు.
ఇది మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో సంప్రదాయంగా ఉంది.

ఇక్కడ ధనికులు చాలా మంది అందమైన వారిని , వారికి వివాహం అయినా సరే వారి భర్తలకు నగదు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని అద్దెకు తీసుకువెళతారు..ఓ వ్యక్తి తన భార్యను నెలవారీ లేదా సంవత్సరానికి సరిపడ అద్దెకు వేరొకరి ఇంటికి పంపొచ్చు. దీని కోసం 10 రూపాయల స్టాంప్ పేపర్ పై ఇరువురు సంతకాలు పెడతారు.

ఈ విషయంలో భార్య ఇష్టాలకు సంబంధం ఉండదు. గడువు పూర్తి అయ్యాక ఆమెని భర్త దగ్గరకు పంపించేస్తారు. ఆ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్యం చేయించాల్సిందే, నెలకు 5 వేల నుంచి 50 వేల వరకూ చెల్లిస్తారట అద్దె.