హోటల్ యజమానికి 1,446 సంవత్సరాల జైలు శిక్ష కఠినమైన తీర్పు ఏం చేశాడంటే

హోటల్ యజమానికి 1,446 సంవత్సరాల జైలు శిక్ష కఠినమైన తీర్పు ఏం చేశాడంటే

0
84

ఏదైనా హోటల్ పుడ్ పై నమ్మకంతో ఇక్కడ శుచి శుభ్రత ఉంటాయి అని చాలా మంది వస్తారు, ఈ సమయంలో
హోటల్ యజమానులు ఇవి పాటించకపోతే మరెవ్వరూ వీటి దగ్గరకు రారు. అయితే తమ హోటల్లో ఆహార ఉత్పత్తుల కొనుగోలు విషయంలో వినియోగదారులను మోసం చేసినందుకు థాయిలాండ్కు చెందిన ఇద్దరు హోటల్ యజమానులకు థాయిలాండ్ కోర్టు 1,446 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

తాజాగా లీమ్గేట్ ఫుడ్ రెస్టారంట్ కస్టమర్లకు కొన్ని వోచర్లు ఇచ్చింది, ఇలా 5 కోట్ల రూపాయల ఓచర్లు అమ్మింది ఈ కంపెనీ…
అయితే, కస్టమర్ల డిమాండ్ ని తట్టుకోలేమని చెబుతూ హోటల్ యజమానులు కొన్ని రోజుల్లోనే హోటల్ ని మూసివేశారు.
దీని గురించి కొన్ని వందల మంది ఫిర్యాదు చేయడంతో హోటల్ యజమానులపై కేసు నమోదు చేశారు.

థాయిలాండ్ చట్టం ప్రకారం ఇలాంటి పబ్లిక్ మోసాలకు 20 సంవత్సరాల గరిష్ట శిక్ష ఉంటుంది. వీరు 10 మంది విందుకు 1600 రూపాయలు చాలు అని తెలిపారు, ఇలా వేల మంది వోచర్లు తీసుకున్నారు, దీంతో తాము సరిపెట్టలేము అని తేల్చింది,
కొన్ని నెలల పాటువెయిట్ చేయాల్సిందే అని తెలిపింది. ఇలా అందరిని మోసం చేశారు అని వీరికి
1446 సంవత్సరాల శిక్ష విధించారు.