కొన్ని కొన్ని దేవాలయాలు పురాతన ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి, అవి ఒక్కోసారి తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి, చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి, అలాంటి దేవాలయం ఒకటి బయటపడింది..
ఒడిశా రాష్ట్రంలో ఓ విచిత్రం జరిగింది. సుమారు 500 ఏండ్ల కింద నీట మునిగిన ఓ పురాతన గుడి ఇప్పుడు బయటపడింది.
కటక్లోని మహా నదీ తీరంలో మునిగిపోయిన పురాతన ఆలయాన్ని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్కు చెందిన పురావస్తు సర్వే బృందం ఇటీవల కనుగొన్నది. దీనిని చూసి అందరూ షాక్ అయ్యారు, అసలు ఇక్కడ ఇలాంటి గుడి ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు
పడవలో నది అంతా గాలిస్తూ పలు ప్రయత్నాల తర్వాత దీనిని గుర్తించినట్లు ఆ బృందం చెబుతోంది…కటక్ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్ వద్ద నది మధ్యలో ఈ గుడి పై భాగాన్నికనుగొన్నట్లు చెబుతున్నారు, 60 అడుగుల ఎత్తున ఉంది ఈ పురాతన ఆలయం.