మనిషి చనిపోయాక కాలి బొటన వేళ్లను ఎందుకు కలిపి కడతారు ?

మనిషి చనిపోయాక కాలి బొటన వేళ్లను ఎందుకు కలిపి కడతారు ?

0
95

మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత ఆ వ్య‌క్తి ఈ లోకం నుంచి వెళ్లిపోతాడు, అయితే చివ‌ర‌న అనేక ఆచారాలు అమ‌లు చేస్తారు.. ఇవ‌న్నీ మ‌నం పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఆచారాలు. మ‌న తాత ముత్తాత‌ల నుంచి ఇవి వ‌స్తున్నాయి.

అంత్యక్రియల సమయంలో చేసే ఒక పని గురించి చెప్పుకోవాలి, చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు, శవానికి కాలి రెండు బొటన వేళ్ళు కలిపి దారం తో కట్టడం చేస్తారు. ఇలా చేయడానికి వెనకాల ఒక కారణం ఉంది…మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరే పోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ ఆత్మ వేరే వాళ్ల శ‌రీరంలోకి వెళ్లి బ‌త‌కాలి అని కోరుకుంటుంది.

ఇలా శవంలో దూరి మ‌ళ్లీ రావాలి అని ప్ర‌య‌త్నిస్తుంది,అలా ప్రయత్నిస్తున్నప్పుడు కాళ్లను కదలకుండా ఉంచటానికి ఒక తాడు లేదా దారం తో రెండు బొటనవేళ్లను కట్టేస్తారు. అయితే మ‌రో సైన్స్ కార‌ణం కూడా ఉంది, చ‌నిపోయిన త‌ర్వాత శ‌రీరం బిగుసుకుపోతుంది, ఈ స‌మ‌యంలో కాళ్లు ప‌క్క‌కు ప‌డిపోతూ ఉంటాయి, అందుకే ఇలా కాళ్ల‌ను వేలితో దారం క‌లిపి క‌ట్టేస్తారు.