ప్రేమించి పెళ్లిచేసుకుని ఆపై…..

ప్రేమించి పెళ్లిచేసుకుని ఆపై.....

0
99

యువతీ యువకుడు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు… హైదరాబాద్ లో ఇద్దరు నివాసం ఉంటున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత యువకుడు కనిపించకుండా పోయాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఈసంఘటన చిన్న శంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో జరిగింది… గ్రామానికి చెందిన చింతాకు ప్రవీణ అనే యువతి అదే గ్రామానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది…

వీరిద్దరి ప్రేమ ఏడాది పాటు సాగగా అతన్నినమ్మి అతనితో వెళ్లిపోయి హైదరాబాద్ లో వివాహం చేసుకుంది.. అక్కడే ఎవ్వరికి తెలియకుండా కాపురం ప్రారంభించారు… ఆతర్వాత కొన్నిరోజులకు ప్రవీణ గర్భం దాల్చగా మాత్రలు ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేశాడు.. ఇక ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది…

వారు ఊరికి పిలిపించుకుని పంచాయితీ పెట్టారు పెద్దల సమక్షంలో యువకుడు ప్రవీణకు తాళి కడతానని ఒప్పుకున్నాడు.. ఆతర్వాత పత్తాలేకుండా పోవడంతో ప్రవీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసులు యువకుడితో మాట్లాడి న్యాయం చేస్తామని లేదంటే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామాని అన్నారు..