ఇది కలికాలం.. ఈ సమయంలో నిజం ఒప్పులు కనిపించడం చాలా కష్టం అనే చెప్పాలి, కొందరిలో నీతి నిజాయతీ కనిపిస్తోంది, అయితే ఈ సమయంలో కూడా నీతిగా నిజాయతీగా తమకు దొరికిన బంగారం ఇచ్చి వారి నిజాయతీ నిరూపించుకున్నారు ఈ జంట.
నల్గొండ జిల్లాలో కేతరాజు నర్సింహ, మంజుల దంపతులు, దుస్తులు ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి వృత్తి చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన భద్రారెడ్డి, లక్ష్మీ దంపతులు కొన్ని దుస్తులను 26న ఉతికేందుకు వారికి ఇచ్చారు. వాటిని ఇస్త్రీ చేస్తున్న సమయంలో ఫ్యాంట్ జేబులో బాక్స్ కనిపించింది.
అందులో తెరచి చూడగా పది తులాల బంగారం బాక్స్ కనిపించింది, వెంటనే సుమారు ఐదు లక్షల విలువ చేసే బాక్స్ దొరకడంతో వారు దానిని దొంగిలించలేదు, నేరుగా స్ధానిక లీడర్ కు ఈ విషయం చెప్పారు, ఆ లీడర్ పోలీసులకు తెలపడంతో ఆ బట్టలు ఎవరివో వారికి కబురు పంపి వారికి బంగారం అందించారు, దీంతో ఇంత గొప్ప పని చేసినందుకు ఆ దంపతులని అందరూ సత్కరించారు.