వ్యవస్థ ఏదైనా అందులోకి ముందుగా తనవాళ్లను చొప్పించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజం అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు… అంతేకాదు తనకు అనుకూలంగా దాన్ని నాశనం చెయ్యడం. నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారని ఆరోపించారు విజయసాయిరెడ్డి… ఇప్పుడా టక్కుఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అర్థమైందని అన్నారు..
ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా ? నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపు పైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా అని ప్రశ్నించారు…