ఏపీ సర్కార్ కు షాక్… కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చిన లోకేశ్

ఏపీ సర్కార్ కు షాక్... కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చిన లోకేశ్

0
88

కరోనా టైమ్ లో పనుల్లేక పేద మధ్యతరగతి ప్రజలపై ఏపీ సర్కార్ వ్యాట్ పేరుతో డీజిల్ ధర పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని లోకేశ్ మండిపడ్డారు… ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు…

బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు.పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అని వాపోయారు లోకేశ్

ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో అని ఎద్దేవా చేశారు…